Natyam ad

మదనపల్లెలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

మదనపల్లె ముచ్చట్లు:

ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన మదనపల్లె లో ఆదివారం అర్ధ రాత్రి జరిగింది. పట్టణంలోని ఇందిరా నగర్ కు చెందిన కలందర్ ఖాన్ కుమారుడు పఠాన్ జాఫర్ (40) ఏం జరిగిందో ఏమో.. తను పని చేసే షాపులోనే ఉరి వేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు బాధితున్ని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, వైద్యం అందించేందుకు పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. ఆత్మ హత్యకు గల కారణాలు రెండో పట్టణ పోలీసుల దర్యాప్తులో తెలియాల్చి ఉంది.

 

Post Midle

Tags: Man committed suicide by hanging himself in Madanapalle

Post Midle