పాము కాటుకు వ్యక్తి మృతి

బనగానపల్లె ముచ్చట్లు:


బనగానపల్లె మండలంలోని వీరాపురం గ్రామానికి చెందిన ఇమాంసా (59) పాముకాటుతో మృతి చెందాడు ఇమాం హుస్సేన్ తోటి వ్యవసాయ కూలీల తో కలసి పొలం పనులు చేస్తుండగా అకస్మాత్తుగా పాము చేతికి కరిచింది వెంటనే ఆయనను బనగానపల్లె వైద్యశాలకు హుటాహుటిన తరలించారు బనగానపల్లె వైద్యశాలలో కోలుకోలేక మృతిచెందాడు బనగానపల్లె వైద్యశాలలో మృతుడు ఇమాంహుస్సేన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు బనగానపల్లె ఎస్ఐ రామిరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇది ఇలా ఉండగా మృతుడికి భార్య ఒక కూతురు ఉన్నారు ఆస్పత్రిలో యాగంటి ఆలయ చైర్మన్ తోట బుచ్చిరెడ్డి తదితరులు కుటుంబ సభ్యులను ఓదార్చారు.

 

Tags: Man dies due to snake bite

Leave A Reply

Your email address will not be published.