పుంగనూరు రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పుంగనూరు ముచ్చట్లు:
నడిచివెళ్తున్న వ్యక్తిని అతివేగంగా వచ్చిన ద్విచక్రవాహదారుడు ఢీకొనడంతో ఆవ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం పట్టణంలో జరిగింది. పట్టణంలోని నాగపాళ్యెంలో నివాసం ఉన్న జంగాలగణేష్(58) అనే వ్యక్తి వ్యాపారం చేసి జీవించేవాడు. ఇలా ఉండగా ఉదయం ఇంటి నుంచి వెళ్తున్న సమయంలో గోకుల్ సర్కిల్లో ద్విచక్రవాహనదారుడు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలైంది. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి త రలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య,పిల్లలు ఉన్నారు.

Tags; Man dies in Punganur road accident
