బ్లాక్‌ఫంగస్‌తో వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా ముచ్చట్లు :

 

బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతో ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా విస్సన్నపేటకు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి ఎస్వీ కృష్ణారావు (61) విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందారు. రెండు నెలల క్రితం ఆయన కరోనా బారిన పడి కోలుకున్నారు. రెండు నెలలుగా మైలవరంలోని కుమార్తె ఇంటి వద్దే ఉంటున్నారు. ఇటీవల ఆయనకు ముక్కులో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపించడంతో కుటుంబసభ్యులు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించారు. మరోసారి తీవ్ర అనారోగ్యం పాలవడంతో శనివారం ఆయనను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Man dies of black fungus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *