చెరువులో మునిగి వ్యక్తి మృతి
వికారాబాద్ ముచ్చట్లు:
వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రానికి చెందిన మల్లయ్య (22) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో దోమ గ్రామానికి చెందిన పెద్ద చెరువులో శవమై తేలాడడు. చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి మృత్యువాత పడ్డాడా లేదా చెపలు పట్టుతున్న సమయంలో ఎవరైనా దాడి చేసి చంపి చెరువులోళపడవేసారా అనుమానం నెలకొంది.చెరువు సమీపంలోంచి వెళ్తున్న కొందరు చెరువులో ఉన్న శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చెరువులో ఉన్న శవాన్ని బయటకు తీసి చూడగా దోమ గ్రామానికి చెందిన వ్యక్తి మల్లయ్య గా గుర్తించారు పోలీసులు. నిన్న రాత్రి చేపల వేటకు చెరువులో దిగి చేపలవల కాళ్లుకు చిక్కుకుని చెరువు లోమృతి చెందినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.తలకు బలమైన గాయాలు ఉండడంతో చేపలు పట్టే సమయంలో గొడవ జరిగి ఉండోచ్చని కుంటుబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సరైన దర్యాప్తు చెయ్యలని కోరారు. మృత దేహాన్ని పోస్టుమార్టం కొరకు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Tags; Man drowns in pond