పందిని ఢీకొని వ్యక్తి దుర్మరణం
చంద్రగిరి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా పూతలపట్టులో విషాదం నెలకొంది. రోడ్డు పైకి హటాత్తుగా వచ్చిన పందిని ద్విచక్ర వాహన దారుడు ఢీకొని కింద పడిపోయాడు. ఘటనలో జంతువుతోపాటు ద్విచక్ర వాహన దారుడు మృతి చెందాడు. నాయుడుపేట- పూతలపట్టు జాతీయ రహదారిలోని బోడింబాయి వద్ద ఘటన జరిగింది. తిరుపతి నుండి చిత్తూరుకు ద్విచక్ర వాహనంలో వెళుతుండగా పందిని ఢీ కొన్న ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. మృతుడు చిత్తూరుకు చెందిన గజపతి ( 42 ) గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని పరిశీలించగా తలకు బలమైన గాయం కావడంతో అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చంద్రగిరి పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Man killed by collision with pig

