Natyam ad

కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

ఎన్టీఆర్ ముచ్చట్లు:


ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని పేరకలపాడు 65వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పేరకలపాడు క్రాస్ రోడ్ వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టింది. తీవ్ర గాయాల పాలైన ద్విచక్ర వాహనదారుడిని నందిగామ ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ కి పోలీసులు తరలించారు. బాధితుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు కంచికచర్లకి చెందిన నన్నపనేని వీరనారాయణ గా గుర్తించారు. పేరకలపాడు నీటి కులాయి దగ్గరకు మంచినీటి కోసం కంచికచర్ల నుండి వస్తుండగా వెనుక నుండి కారు ఢీ కొట్టింది.

 

Tags: Man killed in car collision

Post Midle
Post Midle