రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Date:30/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

బోయకొండ- మదనపల్లె రహదారిపై జరిగిన ద్విచక్రవాహన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం పుంగనూరు మండలంలో జరిగింది. చౌడేపల్లె మండలం గుట్టపల్లెకు చెందిన సిద్దప్ప(39) , యానాదికాలనీకి చెందిన నాగరాజు (36)తో పాటు మరో నాగరాజు(34) కలసి ముగ్గరు ద్విచక్రవాహనంపై గురువారం రాత్రి వస్తుండగా మార్గ మధ్యంలో ప్రమాదానికి గురైయ్యారు. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న సిద్దప్ప, యానాదికాలనీకి చెందిన నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యానాదికాలనీకి చెందిన నాగరాజు చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందాడు. ఈ మేరకు ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి , కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వీధి వ్యాపారులకు గొడుగుల పంపిణీ

Tags: Man killed in road accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *