బైక్ అదుపుతప్పిన రోడ్డు ప్రమాదం…వ్యక్తి మృతి
నెల్లూరు ముచ్చట్లు:
బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి వ్యక్తి మృతి చెందిన సంఘటన రాపూరు మండలం సిద్దవరం సమీపంలో శనివారం ఉదయం జరిగింది.పోలీసులు కథనం మేరకు పొదలకూరు మండలం అయ్యగారిపాలెం కు చెందిన యకసిరి రమేష్ (40) అనే వ్యక్తి పొదలకూరు నుంచి వెంకటగిరి కి వెళ్తుండగా సిద్దవరం సమీపంలోని మలుపు వద్ద డివైడర్ ను బలంగా ఢీ కొని అవతల వైపు రాళ్ళ మీద పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: … Man killed in road mishap