Natyam ad

కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువేంటో తెలుస్తుంది కే. ఎస్. వాసు

తిరుపతి ముచ్చట్లు:

ఉద్గాటన కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువేంటో తెలుస్తుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోషియేషన్ (అపు స్మా) రాష్ట్ర లీగల్ అడ్వైజర్ కే ఎస్ వాసు ఉద్గాటించారు. అబ్దుల్ కలామ్ 91వ జయంతి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం బాలాజీ కాలని లోని శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాటశాల నందు సంకల్ప సేవా సమితి అడ్వర్యంలో అబ్దుల్ కలామ్ జీవిత చరిత్ర పై వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల ప్రారంభ సభ కు ముఖ్య అథితిగా విచ్చేసిన కే ఎస్ వాసు మాట్లాడుతూ కష్టాలు కడలి నుండి ఎదురీది డా. ఏ పీ జే అబ్దుల్ కలామ్ రాష్ట్రపతి స్తాయికి ఎదిగారని అన్నారు, కష్టాలు ఎదిరినప్పుడే మనిషికి విజయం విలువేంటో తేలుస్తుందని అన్నారు. విజయాన్ని చూసి ఎప్పటికి మురిసిపోవద్దని ఎందుకంటె అది కేవలం నీ తొలి అడుగు మాత్రమే గమ్యం కాదని అన్నారు. మనం కేవలం విజయాల నుండే పైకి రాలేము అపజయాల నుండి కూడ ఎడగడం నేర్చుకోవాలని తెలిపారు. సంకల్ప సేవా సమితి అధ్య క్షులు ఎన్. రాజారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 28న మహాతి అడిటోరియం లో జరిగే ఉత్తమ విద్యార్తీ అభినందన సభ లో ఈ పోటీలల్లో గెలుపొందిన వారికి బహుమాతులు ఇవ్వాదం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీలల్లో 460మంది విద్యార్థలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో శ్రీ పద్మవతి స్కూల్ ప్రధానో పాద్యయులు పద్మావతి, ఎస్ వీ ఐ టీ ఐ కరెస్పాడెంట్ ఓం ప్రకాశ్, సాయి రాం స్కూల్ (బాకరాపేట) అధినేత జనార్ధన్, సంకల్ప సేవా సమితి నాయకూలు షేక్ మహ్మద్ రపీ, పెదరాయుడు మరియు విద్యార్తులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Man knows the value of success only when faced with difficulties. S. Vasu

Post Midle