ఆలేటివారిపల్లెలో వ్యక్తి హత్య

Date:19/09/2020

బి.కొత్తకోట ముచ్చటు:

Man murdered in Aletivaripalle

ఓ వివాహితతో చనువుగా ఉంటున్నాడన్న కారణంతో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఓ వర్గం అతని తండ్రిని హత్యచేసిన సంఘటన శుక్రవారం రాత్రి బి.కొత్తకోట మండలంలోని ఆలేటివారిపల్లెలో చోటుచేసుకొంది. మదనపల్లె సిఐ అశోక్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం…గ్రామానికి చెందిన కే.వెంకటరమణ (66) చిన్న కుమాతుడు శ్రీనివాసులు వివాహమైన ఇదే గ్రామానికి చెందిన మహిళతో చనువుగా ఉంటున్నాడని వివాదమైంది. ఈ వ్యవహారం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. రెండువర్గాలు ఆరోపణలు చేసుకొన్నప్పటికి ఫిర్యాదులు ఇవ్వకుండా వెళ్లిపోయారు. రాత్రి ఓ వర్గానికి చెందిన వ్యక్తులు శ్రీనివాసులుపై దాడి చేసేందుకు ఇంటివద్దకు వెళ్లి కేకలు వేశారు. ఈ దాడిని అడ్డుకునేందుకు శ్రీనివాసులు తండ్రి వెంకటరమణ ప్రయత్నించగా అతనిపై ప్రత్యర్థులు కోడవలితో తలపై నరికారు. చికిత్సకోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్సొందుతూ మృతి చెందాడు. హతుడు వెంకటరమణ పెద్దకుమారుడు మంజునాధ్‌ ఫిర్యాదు మేరకు జే.రెడ్డెప్ప, వెంకటరమణ, నారాయణస్వామి, సుబ్రమణ్యం, మోహన, హరి, కాంతులతోపాటు మరో ఏడుగురిపై సిఐ ఆశోక్‌కుమార్‌ కేసు నమోదు చేశారు. హత్య జరిగిన సంఘటనా స్థలాన్ని శనివారం సిఐ పరిశీలించారు. దాడి ఎలా జరిగింది, ఎంతమంది పాల్గొన్నారు, ఏవరెవరి ప్రమేయం ఉందన్న అంశాలను పరిశీలించారు.

కోవిడ్‌ ఆస్పత్రులకు టూరిజం భోజనం

Tags: Man murdered in Aletivaripalle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *