మనబడి నాడు_నేడు పాఠశాలకు భూమి పూజ
నందవరం ముచ్చట్లు:
ముఖ్యమంత్రి వైస్. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మన బడి నాడు- నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చిందని గ్రామ సర్పంచ్ బైటిగేరి శివన్న, ఎంపీటీసీ విజయమోహన్ రెడ్డి అన్నారు. మంగళ వారం నందవరం మండల పరిధిలోని జోహారపురం గ్రామంలో ఎంపీయూపీ స్కూల్లో మండల విద్యాధికారి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో మన బడి నాడు- నేడు పనులకు భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు తమ వంతు కృషితో విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని పేర్కొన్నారు. నాడు- నేడు ద్వారా పాఠశాల మరమ్మత్తులకు రూ.20 లక్షలు మంజూరు అయ్యాయన్నారు. పనుల్లో నాణ్యత పాటించి, వేగవంతంగా పూర్తి చేయాలని పేరెంట్స్ మానిటరింగ్ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు సోమశంకర్ రెడ్డి, రమేష్ రెడ్డి, మహేశ్వర రెడ్డి, పాఠశాల చైర్మన్ అంజనేయులు, ప్రధానోపాధ్యాయులు మాబు, ఉపాద్యాయులు రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Manabadi Nadu_Bhoomi Pooja for school today

