మానవసేవయే మాధవసేవ,

అర్చకులకు నిత్యా వసర సరుకులు పంపిణీ లో   స్వామి  సుకృతానంద
కడపముచ్చట్లు:

 

 

కడప రామకృష్ణ మఠం లో మానవసేవే మాధవసేవ అని   రామకృష్ణ మఠం   సెక్రెటరీ   సుకృ తానంద  అర్చకులకు   నిత్యావసర సరుకుల పంపిణీ లో పేర్కొన్నారు   ఈరోజు స్థానిక    చెన్నూరు బస్టాండ్ లోని   రామకృష్ణ మఠం లో   కోవిడ్ వ్యాధి లాక్ డౌన్ వల్ల   ఇబ్బందులు పడుతున్న ఆలయ అర్చకుల ను గుర్తించి   వారికి నిత్యావసర సరుకులు అయిన  బియ్యం    బేడలు  వంటనూనె   తదితర వస్తువులను   దాదాపు 22 మందికి పంపిణీ చేశారు   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ      సమాజంలో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి   వారికి తమవంతు చేయూత ఆనందించడమే స్వామి వివేకానంద లక్ష్యం అని తెలిపారు  ఆయన ఆశయాలమేరకు రామకృష్ణ మఠం స్థాపించడం జరిగిందన్నారు . కోవడ్ లో ఇబ్బందులు పడుతున్న వారికి   స్వచ్ఛంద సంస్థలు ,  సంఘ సేవకులు ,  దాతలు ముందుకు వచ్చి   సేవలు అందించాల్సిన అవసరం అని తెలిపారు .  అదే విధంగా   ప్రైవేట్ పాఠశాలలో   జీతాలు అందక   ఇబ్బందులు పడుతున్న   మరికొంతమందికి    నిత్యావసర సరుకులు అందిస్తామని తెలిపారు.   ఈ కార్యక్రమంలో   స్వామి సన్నివాసనంద,  శ్రీనివాసానంద   స్వామి సత్యానంద   వాలంటీర్లు   శంకర్ నారాయణ,   సుబ్రహ్మణ్యం రావు ,  రామచంద్ర రావు,   సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Manavasevaye Madhavaseva,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *