Natyam ad

కూతురుతో కలిసి మంచు లక్ష్మీ డ్యాన్స్

హైదరాబాద్,   ముచ్చట్లు:

చమ్కీల అంగిలేసి ఓ వదినే చాకు లెక్కుండేటోడే’.. గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోందీ సూపర్‌హిట్ సాంక్‌. నాని, కీర్తి సురేశ్‌ల దసరా సినిమాలోని ఈ పాట ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌, వాట్సప్‌ స్టేటసుల్లో దుమ్మురేపుతోంది. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఈ పాటను ఎంజాయ్‌ చేస్తున్నారు. సినీ ప్రముఖులతో పాటు యూట్యూబర్స్‌, నెటిజన్లు ఈ పాటను రీక్రియేట్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా మంచు లక్ష్మీ చమ్కీల అంగిలేసి పాటకు కాలు కదిపింది. తన కూతురు విద్వానిర్వాణతో కలసి అద్భుతంగా డ్యాన్స్‌ చేసింది. పింక్‌ కలర్‌ శారీలో సాంగ్‌ లిరిక్స్‌కు తగ్గ హావభావాలను ప్రదర్శిస్తూ తల్లీకూతుళ్లు సూపర్బ్‌గా స్టెప్పులేశారు. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

 

 

 

Post Midle

అలాగే దసరా చిత్రం సక్సెస్‌ కావాలంటూ సినిమా యూనిట్‌కు బెస్ట్‌ విషెస్‌ను అందించింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ డ్యాన్స్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లీ కూతుళ్లు డ్యాన్స్‌ అద్భుతమంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.దసరా సినిమాలోని చమ్కీలా అంగిలేసి పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. దీనికి దీక్షిత (డీ), రామ్‌ మిరియాల తమ తీయమైన గొంతుతో ప్రాణం పోశారు. యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న ఈ పాట ఇప్పటికే 30 మిలియన్లకు పైగా వ్యూస్‌తోట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ఇక దసరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాను సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు.

Tags;Manchu Lakshmi dances with her daughter

Post Midle