Natyam ad

మండల స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రారంభించిన మునిసిపల్ ఛైర్ పర్సన్

మదనపల్లె ముచ్చట్లు:

పిల్లల్లో సైన్స్ మరియు టెక్నాలజీ పై ఆసక్తి పెంచేందుకు మరియు వారిలో విజ్ఞానాన్ని నింపేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదం చేస్తాయని మున్సిపల్ ఛైర్ పర్సన్ వరపన మనూజ పేర్కొన్నారు. నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో క్రై మరియు పోర్డ్ సంస్థ ఆధ్వర్యంలో మండల స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుజాత, కౌన్సిలర్ ఫర్జానారఫీ, ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి మండల స్థాయిలోని  11 ఉన్నత పాఠశాలల నుండి వచ్చిన 112 మంది పిల్లలు వారు తయారు చేసిన  వివిధ రకాల సైన్స్ ప్రాజెక్ట్స్ తో హాజరు అయి వాటి గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా మునిసిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ పోర్డ్ సంస్థ పిల్లల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ, వాటిలో భాగంగా ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు చేపట్టి పిల్లల్లో నైపుణ్యం పెంపొందించడానికి కృషి చేయడం అభినందనీయమన్నారు.

 

Tags: Mandal Level Science Fair initiated by Municipal Chairperson

Post Midle
Post Midle