Natyam ad

పుంగనూరులో 8న మంత్రి పెద్దిరెడ్డిచే మండల కార్యాలయం ప్రారంభం

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా నూతన మండల పరిషత్‌ కార్యాలయాన్ని ఈనెల 8న ప్రారంభిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రూ.2.60 కోట్లతో నిర్మించిన మండల కార్యాలయాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా మాట్లాడుతూ పట్టణంలోని రాగానిపల్లె రోడ్డు, ఈస్ట్ పేటలో నిర్మించిన రెండు అర్భన్‌ హెల్త్ సెంటర్లను మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఒకొక్క భవన నిర్మాణానికి రూ.80 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. వీటితో పాటు శాంతినగర్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ ఐఓల్టేజ్‌ లైన్లను మార్పు చేసే కార్యక్రమం పనులను మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఈలైన్ల మార్పుకు సుమారు రూ.86 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మంత్రి పర్యటనను జయప్రదం చేయాలని ఎంపీపీ, చైర్మన్‌ కోరారు.

 

Post Midle

Tags: Mandal office inaugurated by Minister Peddireddy on 8th in Punganur

Post Midle