మొక్కుబడిగా సాగిన మండల ప్రజా పరిషత్ భేటీ
వరంగల్ ముచ్చట్లు:
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగింది. ఈ సమావేశంలో గ్రామాల్లోని సమస్యలు, అభివృద్ధిపై చర్చించారు . శుక్రవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నూనవాట్ కమల పంతులు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు హాజరుకాగా, పలు శాఖల అధికారులు హాజరై పలుశాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. సభ్యులు ఎవరూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకురాలేదు. దీంతో సమావేశం గంటన్నరలో ముగిసింది. ఈ సందర్భంగా జడ్పీటిసి బానోత్ సింగ్ లాల్ మాట్లాడారు. రైతులు లాభదాయకమైన ఆయిల్పామ్ పంటను సాగుచేయాలన్నారు. ప్రజలకు ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు, ప్రజాప్రతినిఽధులు అవగాహన కల్పించి,
మండలాన్ని ప్లాస్టిక్రహిత మండలంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండోవిడత కంటివెలుగును గ్రామాల్లో ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఎంపీపీ కమల పంతులు మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి, గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.. ఈ కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యులు సర్వర్ అహ్మద్, వైసీపీ ఎర్రబెల్లి రాజేశ్వరరావు, ఎంపీడీవో ఎంపీదివో చక్రాల సంతోష్ కుమార్. రైతుబంధు మండల కోఆర్డినేటర్ శ్రీనివాస్, కో ఆప్షన్ మెంబర్ షబ్బీర్, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags: Mandal Praja Parishad meeting went smoothly
