మండల మహిళా సమైక్య సమావేశం

పగిడ్యాల ముచ్చట్లు:

 

పగిడాల మండల మహిళా సమైక్య ప్రతి నెల జరుగు సమావేశం ఈరోజు నిర్వహించడమైనది ఈ కార్యక్రమము నందు ఎంపిడిఓ వెంకటరమణ , హౌసింగ్ AE, ఏరియా కోర్డినేటర్ కల్పలత,ఎపియం శ్రీనివాసులు సిసి లు జంగిలయ్య, యాపిలయ్య, నాగన్న ఉమామహేశ్వరి, మండల సమాఖ్య ప్రతినిధులు చెన్నమ్మ, విజయమ్మ , గ్రామ సంఘాల ప్రతినిధులు  జడ్. పి. యన్. యఫ్ రిసోర్స్  పాల్గొనడం అయినది. మంగళవారం నాడు ఈ కార్యక్రమం నందు ఎంపిడిఓ వెంకటరమణ ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల సమాఖ్య సభ్యుల  రికవరీ విధానం బాగుంది.  సంఘం, గ్రామ సంఘం పుస్తకాలు సక్రమంగా బుక్కిపర్స్ ప్రతి నెల వ్రాయించుకోవాలి. అప్పుడు అవకతవకలు జరగవు.గ్రామ పంచాయతీ ద్వారా మూడు కార్యక్రమాలు చేస్తుంది, గ్రామ పారిశుధ్యం, త్రాగు నీరు, వీధి లైట్లు సక్రమంగా అందు విధముగా చూడడం జరుగుతుంది.
గ్రామాలలో చెత్త సేకరణ, హౌసింగ్ కాలనీలలో ఇంటి నిర్మాణాలు వేగవంతం చేయాలి లబ్ధిదారులు ఇంటి నిర్మాణం కోసం 35000 రుణాలు మంజూరు చేయాలి అని తెలియజేశారు.

 

Tags: Mandal Women’s Union Conference

Leave A Reply

Your email address will not be published.