ముఖ్యమంత్రి బాబు కి శుభాకాంక్షలు తెలియజేసిన మండిపల్లి

-రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ని కలిసిన రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి

-చారిత్రాత్మక విజయం అందుకున్న ముఖ్యమంత్రి బాబు కి శుభాకాంక్షలు తెలియజేసిన మండిపల్లి

-రాయచోటీలో గెలుపొందిన మండిపల్లి కు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

-రాయచోటి అభివృద్ధికి సహకారం అందించాలిని బాబు ని కోరిన మండిపల్లి

 

మంగళగిరి ముచ్చట్లు:

 

రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక సీట్లతో చారిత్రాత్మక విజయం సాధించి బుధవారం రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు&ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని సోమవారం రోజు రాత్రి ఉండవల్లి లోని తన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాయచోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ,ఆయన కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి .ఈ సందర్భంగా మండిపల్లి మాట్లాడుతూ రాయచోటి అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందించాలని, అలాగే మున్సిపాలిటీలో డ్రైనేజీ కాలవలు,రోడ్లు,మౌలిక సదుపాయాలు అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా రాయచోటిలో అత్యధికంగా ఉన్న ముస్లిం మైనారిటీల కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన షాదీ ఖానా శిధిలావస్థకు చేరుకుందిని.దానిని మరమ్మత్తులు చేయించి వాడుకలోకి తీసుకురావాల కోరారు. మైనారిటీలు ఎక్కువగా ఉండే రాయచోటి కొత్తపల్లిలో సరైన మౌలిక సదుపాయాలు లేక ప్రజలు త్రీవర ఇబ్బందులకు గురవుతున్నారని వాటి అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను కేటాయించాలని కోరారు.బాబు  బదిలిస్తూ 20 సంవత్సరాల తర్వాత రాయచోటిలో తెలుగుదేశం పార్టీ గెలుపొంది సత్తా చాటామని రాబోయే రోజుల్లో రాయచోటి అభివృద్ధి కోసం పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

 

Tags:Mandipalli congratulated Chief Minister Babu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *