మండూస్ తుఫాన్ అప్డేట్
-కొనసాగనున్న 2 వ నెంబర్ హెచ్చరిక
విశాఖపట్నం ముచ్చట్లు:
మండూస్ తుఫాను ప్రస్తుతం గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకి తీవ్ర తుఫానుగా మారి ఈరోజు ఐదున్నర గంటలక వరకు కూడా కొనసాగుతూ శుక్రవారం ఉదయం బలహీనమై తుఫానుగా కొనసాగుతోంది.ప్రస్తుతం ఇది కరేకల్ కి తూర్పు దిశలో 180 కిమీ దూరంలోనూ, చెన్నై కి దక్షిణ ఆగ్నేయంగా 260కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. రానున్న గంటల్లో వాయవ్య దిశలో పయనించి శనివారం రాత్రి కి గాని, ఉదయానికి గాని చెన్నైకి కరేకల్ కి మధ్యలో ఉన్న మహాబలిపురం పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో లేదా తీరం దాటిన తరువాత బలహీన మై తీవ్ర వాయుగుండంగామారనుంది. తరువాత అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, అనంతపూర్, కడప జిల్లాలలో తేలిక నుంచి మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్లా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తీరం వెంబడి గాలులు గంటకు 45 నుండి 55 కి.మీ వేగంగా ఉంటాయి. సముద్ర అల్లకల్లోలం గా ఉండడం తో రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళొడదని సూచించడంతో పాటు….దక్షిణ తీర ప్రాంతాల్లో 3 వ నె0బెర్, ఉత్తర కోస్తాలో 2 వ నెంబర్ హెచ్చరిక కొనసాగుతుందని తుఫాన్ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది.

Tags: Mandus Typhoon Update
