రోగం రాని గెనిసిగడ్డల పంటకు మంగళం ప్రసిద్ది
– విత్తనం లేకుండ తీగల పంట
– 20 ఎకరాల పంట
– 50 ఎకరాలలో ఏర్పాటుకు సిద్దం
పుంగనూరు ముచ్చట్లు:

పడమటి మండలమైన పుంగనూరులో ప్రతి సీజన్‌కు రైతులు ఆయా పంటలను పండించడంలో మెలకవలు నేర్చుకున్నారు. సంక్రాంతి, శివరాత్రి పండుగలకు విరివిగా గెనిసిగడ్డలను పండిస్తారు. ప్రస్తుతం సీజన్ లేకపోయినా రోగంలేని గెనిసిగడ్డ పంటను పండించడం ఈ ప్రాంతంలో రైతులు అలవర్చుకున్నారు. మండలంలో గెనిసిగడ్డలపంటలకు ప్రత్యేకమైన గుర్తింపు కల్గిన మంగళం, కంగానెల్లూరు గ్రామాల్లో సుమారు 30 కుటుంభాల వారు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు 100 సంవత్సరాలుగా గెనిసిగడ్డల పంటలు పండించి అదే పంటను పండించడం వృత్తిగా అలవర్చుకుని జీవనాలు సాగిస్తున్నారు. ఈ పంటకు విత్తనాలు ఉండవు. కేవలం తీగలతో గెనిసిగడ్డ పంటను సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వెహోదలు పెడతారు. సంక్రాంతి, శివరాత్రి పండుగలకు ఈ పంటలు వచ్చి, ప్రజలు వీటిని తినేలా పండిస్తారు. ఒక ఎకరానికి 30 టన్నులు గడ్డలు పండుతాయి. ఒక ఎకరానికి రూ. 40 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే ఆదాయం బాగానే ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఎక్కువుగా ఈ పంట మెత్తటి నేలలోనే పండిస్తారు. తక్కువ ఖర్చుతో క్రిమి సంహారక మందులు లేకుండ అధిక దిగుబడులు రావడం జరుగుతుంది.
పంట చేసే విధానం …..
గెనిసిగడ్డల పంట చేసేందుకు రైతులు పొలాన్ని దుక్కి చేస్తారు.అనంతరం సేంద్రియ ఎరువులు భూమిలో వేసి , పొలాన్ని కలియదున్ని పాదులు కడతారు. గడ్డలు తొలి , గడ్డ ప్రక్కన గెనిసిగడ్డ తీగలను నాటుతారు. ఆ వెహోలకలకు రెండు రోజుకోకసారి నీరు పెట్టి, వెహోలక బ్రతికిన అనంతరం కొన్ని రసాయాన ఎరువులు వేస్తారు. సుమారు నెల రోజుల తరువాత వెహోక్క తీగలు పెరగడం వెహోదలౌతుంది. ఇలాంటి తీగలను జాగ్రత్తగా విరిగిపోకుండ రైతులు నాలుగు నెలల పాటు అటు ఇటు తిరగవేస్తూ జాగ్రత్తగా నీరు కట్టి కాపాడుతారు. మూడోనెల నుంచి భూమిలోపల గెనిసిగడ్డలు తయారౌతుంది. నాల్గవనెల పూర్తెయ్యేలోపు భూమిలో గడ్డలు తగిన పరిమాణంలో తయారౌతుంది. ఈ సమయంలో భూమి పైభాగం పగుళ్లుబారుతుంది. దీనిని బట్టి రైతులు పంట పండినట్లుగా నిర్ధారించి , కూలీలచే జాగ్రత్తగా గుద్దిళ్లు అనే ఇనుప పనిముట్ల సహాయంతో గడ్డలు దెబ్బతినకుండ భూమిని త్రవ్వి గడ్డలను భయటకు తీస్తారు. ఈ గడ్డలను నీటిలో కడిగి మట్టిలేకుండ శుభ్రం చేసి విక్రయాలు చేపడుతారు. ఒకొక్క కిలో గెనిసిగడ్డలు రూ.10 ల నుంచి 15 వరకు ధర పలుకుతుంది. రైతులు పంటను కొద్దిగా తవ్వి ప్రతి రోజు మార్కెట్‌కు తరలిస్తారు. పంటతో నష్టం రాకుండ , రైతు మార్కెట్ అవసరాన్ని బట్టి పండించే ఏకైక పంట గెనిసిగడ్డల పంట. ఈ పంట నాలుగు నెలల్లో పూర్తి కాగానే తీగలను కోసి పశువులకు మేతగా వినియోగిస్తారు.
అనేక ఆహార పదార్థాలు తయారి…….
గెనిసిగడ్డలను పిల్లలు, పెద్దలు అనే తేడాలు లేకుండ తీయ్యటి రుచికలిగిన పచ్చి గడ్డలను కూడ తింటారు. కొంత మంది కాల్చి, మరికొంత మంది బె ల్లంనీటిలో , ఉప్పునీటిలో ఉడికించి ఈ గడ్డలను తింటారు. అలాగే ఒబ్బట్లు, సాంబారు, తాలింపుకు ఈ గడ్డలను వినియోగిస్తారు. చక్కర వ్యాది గ్రస్తులకు , ఎముకలు, కండరాల వ్యాది కలిగిన వారు వీటిని తినడం మంచిదని చెబుతారు.
మార్కెట్….
పుంగనూరు పండించిన గెనిసిగడ్డలను బెంగళూరు, చెన్నై, తిరుపతి, హైదరాబాదు, కుప్పం, పలమనేరు, మదనపల్లె ప్రాంతాలకు తరలిస్తారు. అక్కడ కిలో రూ.30 నుంచి రూ.50 వరకు విక్రయిస్తారు. ఇతర ర్ఖా•ల నుంచి వచ్చిన వ్యాపారులు పంటను పొలం వద్దనే కొనుగోలు చేసి ఒక్క సారిగా గడ్డలను త్రవ్వి టెంపోల్లో తీసుకెళ్తారు.
రోగం రాని పంట..
గెనిసిగడ్డల పంటలను మాతాతల కాలం నుంచి పండిస్తున్నాం. తక్కువ ఖర్చుతో ఎలాంటి రోగాలు లేకుండ అధిక దిగుబడులిచ్చే పంట కావడంతో మా ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు గెనిసిగడ్డలను పండించి జీవనం సాగిస్తున్నారు. ఎంతో రుచికరమైన పటంకు ప్రాచుర్యం లేకపోవడంతో రైతులు ఈ పంట ఎక్కువుగా పండించడం లేదు. ప్రభుత్వం దీనిపై ప్రచారం జరిపి , రైతులకు అవగాహన కల్పించాలి.
– ఏ.విజయకుమార్, రైతు. మంగళం.
కష్టం తక్కువ…
గెనిసిగడ్డల పంటకు రైతులు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. మెత్తటి పొలంలో తీగలు నాటి నీరు కట్టడం నాలుగు నెలలు చేస్తే చాలు. పంట చేతికి వస్తుంది. సేంద్రీయ ఎరువులు వేస్తే గడ్డలు పెద్దవిగా పెరిగి , ఒక గడ్డ కిలోకు పైగా వచ్చే అవకాశాలు ఉంది. మందులు కొట్టాల్సిన పని లేదు.
-ఎస్.కృష్ణప్ప, రైతు. మంగళం.
Tags: Mangalam is famous for its disease-free crop of ginseng
