Mangled prices

భగ్గుమంటున్న మామిడి ధరలు

Date:24/05/2019

విజయవాడ ముచ్చట్లు:

మధురమైన మామిడి పండ్లు ధరల విషయానికొస్తే పులుపునే రుచి చూపిస్తున్నాయి. మండు వేసవిలోనూ తియ్యని రుచులు అందించే మామిడి దిగుబడి తగ్గడం, గిరాకీ పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందనంత దూరమైంది. మామిడి పండించే రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు లభించడం లేదు గానీ వ్యాపారులకు మాత్రం కాసుల పంట పండిస్తోంది. ఇటీవలి కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల గాలివానలు, మండుతున్న ఎండలకు మామాడి దిగుబడి ఈ ఏడాది తగ్గిందని రైతులు చెబుతున్నారు. గతంలో వేల ఎకరాల్లో సాగయ్యే మామిడి ప్రస్తుతం వందల ఎకరాలకే పరిమితమైంది. దీనికితోడు రైతులు కూడా మామాడి పంటపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కౌలు రైతులు కాస్త ఆసక్తి కనబరిచి పండించినా వారికి మాత్రం తోటల వద్ద సరైన ధర లభించడం లేదు. ప్రస్తుతం మామిడి పండ్లు 100 వచ్చేసరికి రూ. 2500 నుండి 3వేల వరకు ధర పలుకుతున్నాయి. ప్రస్తుతం రసాలు ఎక్కువుగా మార్కెట్‌లో లభిస్తున్న సందర్భంలోనూ ధరలు అధికంగానే ఉన్నాయి. వినియోగదారుడికి మామిడి ధర చూస్తే రుచించడం లేదు. తగ్గిన దిగుబడి కారణంగా సైజు కూడా చిన్నదిగానే ఉంటోంది. సంవత్సరం మొత్తం తినేందుకు వినియోగించే పచ్చడి మామిడి ధర ఇక చెప్పనే అక్కర్లేదు. ప్రస్తుతం ఒక్కో కాయ సైజు, రకాన్ని బట్టి సుమారు రూ. 20-50 మధ్యనే పలుకుతోంది. గత ఏడాదితో పోల్చిచూస్తే పచ్చడికాయ దాదాపుగా ధరలో రెట్టింపయ్యింది. ఈ ఏడాది కాస్త ఆలస్యంగా వచ్చిన మామాడి పూతను చూసిన కౌలు రైతులు మార్చిలో తోటలు కొంటారు.

 

 

 

 

 

ఎకరాకు సుమారుగా రూ. 50వేల వరకు ఇచ్చి మరీ కొన్నారు. కొందరు రైతులు 10 ఎకరాల చొప్పున రూ. 5లక్షల వరకు వెచ్చించి మరీ తీసుకున్నారు. కానీ మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా పూత రాలిపోవడం, కొన్ని ప్రాంతాల్లో తెగుళ్లు రావడం దిగుబడిపై పెద్ద ప్రభావమే చూపింది. దీంతో తోటలు కౌలుకు తీసుకున్న రైతులు నేడు లబోదిబో అనే పరిస్థితి కనిపిస్తోంది. అయితే వచ్చిన కాస్త దిగుబడిని రైతుల నుండి వ్యాపారులు తక్కువ ధరకు తన్నుకుపోయి, మార్కెట్‌లో మాత్రం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందనంత ఎత్తులో ఉన్న మామిడి పండ్లను పెట్టుబడిదారులు,
భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఉద్యోగులు మాత్రం ఎక్కువ ధరైనా కొంటున్నారుమామిడిని మాగబెట్టేందుకు వినియోగించే కార్బైడ్ కల్లోలం సృష్టిస్తోంది. కొనే్నళ్లుగా కార్బైడ్ వాడకాన్ని పూర్తిగా నిషేధించినా వ్యాపారులు మాత్రం మార్కెట్‌లో దీన్ని వినియోగిస్తూనే ఉన్నారు. మామిడి విక్రయిస్తున్న కొందరు పెద్ద వ్యాపారులు కార్బైడ్‌ను అధిక మోతాదులో విచ్చలవిడిగానే వినియోగిస్తున్నారు. మామిడిలో వస్తున్న వివిధ రకాల దిగుబడులకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను అనుసరించి పండ్లను మగ్గబెట్టేందుకు కార్బైడ్‌ని వినియోగిస్తున్నారు. కార్బైడ్‌తో మగ్గిన పండ్లు చూసేందుకు కలర్‌ఫుల్‌గా కనిపించడంతో వీటికి డిమాండ్ కూడా పెరుగుతోంది. కార్బైడ్ వినియోగించి మగ్గబెట్టిన మామిడి పండ్ల నుండి ఒకరకమైన వాసన కూడా వస్తుంటుంది. కాన్నీ దాన్ని పట్టించుకోకుండా వినియోగదారులు ఎగబడి మరీ కొంటున్నారు.

 

 

 

 

 

 

మార్కెట్‌లో బహిరంగంగా కార్బైడ్‌ను వినియోగించి మరీ మామిడిని మగ్గబెడుతున్నారని తెలిసినా అధికారులు అటుగా చూసింది లేదు. ఇథలీన్ గ్యాస్ ద్వారా గానీ, ఎండు వరిగడ్డి ద్వారా గాని మగ్గబెట్టిన మామిడి పండ్లను మాత్రమే తింటే మంచిది. కానీ ఇందుకు కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్న నేపథ్యంలో వ్యాపారులు మాత్రం కార్బైడ్‌ను ఎక్కువ మోతాదులో వినియోగిస్తున్నారు. 2012లోనే కార్బైడ్ వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించింది. అయితే నిషేధాన్ని అమలు చేయడంలో ఉద్యాన, మార్కెటింగ్, ఆహార కల్తీ నిరోధక శాఖలు నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. కార్బైట్ ద్వారా మగ్గబెట్టిన పండ్లు తింటే కేన్సర్, అల్సర్, కాలేయం, మూత్ర పిండాల సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. కార్బైడ్‌ను వినియోగిస్తే దానిద్వారా వెలువడే ఎసిటిలీన్ వాయువు శరీర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. ఇక ఇథలీన్ గ్యాస్ ద్వారా మామిడి పండ్లను
మగ్గబెట్టేందుకు టన్నుకు 2వేల రూపాయలు మాత్రమే ఖర్చు కానుంది. దీనిపై రైతులను, వ్యాపారులను అధికారులు చైతన్యపరిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

 

దీదీ…సెల్ఫ్ గోల్ 

Tags: Mangled prices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *