పుంగనూరులో మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి

పుంగనూరు ముచ్చట్లు:

మామిడి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని జిల్లా రైతు సంఘ అధ్యక్షుడు జనార్ధన్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన పుంగనూరులో విలేకరులతో మాట్లాడుతూ మామిడి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఈ సారి పంట 20 శాతం లోపు మాత్రమే వచ్చిందని , ఆకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఎకరాకు సుమారు రూ.30 వేలు ఖర్చు చేయల్సి వచ్చిందని తెలిపారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్‌ వెంటనే చర్యలు తీసుకుని తోతాపురి కిలో రూ.25లు, టేబుల్‌ వేరైటిలకు కిలో రూ. 40లు ధర ఇప్పించేలా గుజ్జుప్యాక్టరీ యజమానులతో సమావేశాలు నిర్వహించాలని కోరారు.

 

Tags:Mango farmers in Punganur should be given cheaper prices

Leave A Reply

Your email address will not be published.