మ్యాంగో ప్రొసెసింగ్ కంపెనీలు అభద్రతా భావంను వీడి ప్రొడక్షన్

*మ్యాంగో ప్రొసెసింగ్ కంపెనీలు అభద్రతా భావంను వీడి ప్రొడక్షన్ ను ప్రారంభించండి

💐 మ్యాంగో ప్రొసెసింగ్ కంపెనీలు కోవిడ్ – 19 కు సంబంధించి తగు జాగ్రతలు తీసుకుంటూ నడపవచ్చు

💐 ప్రొసెసింగ్ కంపెనీలో పని చేసే కూలీలకు షిఫ్ట్ డ్యూటిలో విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టండి

💐 ప్రొసెసింగ్ కంపెనీ లకు జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు

Date:08/05/2020

చిత్తూరు ముచ్చట్లు:

మ్యాంగో ప్రొసెసింగ్ కంపెనీలు అభద్రతా భావంను వీడి ప్రొడక్షన్ ను ప్రారంభించాలని చిత్తూరు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ నందు జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్త ను చిత్తూరు శాసన సభ్యులు మర్యాదపూర్వకంగా కలసి మ్యాంగో ప్రొసెసింగ్ కంపెనీలు తెరవడానికి గల అంశాలకు సంబంధించి మ్యాంగో ప్రొసెసింగ్ కంపెనీలైన జైన్, నవ్య, మంజునాథ ఫుడ్స్ కంపెనీల ప్రతినిధులైన షామీర్, రమేశ్, మంజునాథ్ లతో కలసి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ మ్యాంగో ప్రొసెసింగ్ కంపెనీలు మామిడి రైతులకు మేలు చేకూరేలా ప్రొసెసింగ్ కంపెనీలు ఈ సీజన్ నందు మ్యాంగో ప్రొడక్షన్ ను ప్రారంభించాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్త మాట్లాడుతూ మామిడి రైతులు మరియు ప్రొసెసింగ్ కంపెనీలు నష్టపోకుండా సమన్వయంతో లాభాలు గడించేలా పని చేయాలన్నారు. మ్యాంగో ప్రొసెసింగ్ కంపెనీలు కోవిడ్ – 19 కు సంబంధించి తగు జాగ్రతలు తీసుకుంటూ నడపవచ్చునని, మ్యాంగో ప్రొసెసింగ్ చేసేందుకు మామిడిని రైతుల నుండి తరలించే సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం ప్రొసెసింగ్ కంపెనీ లకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ప్రొసెసింగ్ కంపెనీల్లో పని చేసే సిబ్బంది అందరూ ఖచ్చితంగా మాస్క్ లు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ పని చేసే విధంగా కంపెనీల యాజమాన్యాలు కృషి చేయాలని, కోవిడ్ – 19 నియంత్రణకు సంబంధించి సిబ్బందిని షిఫ్ట్ ల ప్రకారం విధులకు హాజరయ్యేలా చేయాలని తెలిపారు.

విజయసాయిరెడ్డి టార్గెట్ గా టీడీపీ

Tags: Mango processing companies quit insecurity

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *