మఠంలో ప్రముఖ కన్నడ సినీ దర్శకుడు మంజునాథ్

Date:16/09/2019

మంత్రాలయం  ముచ్చట్లు:

మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి కర్ణాటక ప్రముఖ కన్నడ దర్శకుడు మంజునాథ్ పాండవపుర  ఆదివారం మంత్రాలయానికి వచ్చారు. వీరు ముందుగా గ్రామదేవత మంచాలమ్మ ,రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. పీఠాధిపతులు ఫల మంత్ర అక్షింతలు ఇచ్చి  ఆశీర్వదించారు. “మనసే మంత్రాలయ”  కన్నడ టీవీ సీరియల్ ను రూపొందించడానికి స్క్రిప్టు మొత్తం తయారైపోయిందని  త్వరలోనే మీ ఆశీస్సులతో మనసే మంత్రాలయం అనే టీవీ సీరియల్ ను ప్రారంభించబోతున్నట్లు పీఠాధిపతులకు తెలియజేశారు. పీఠాధిపతులు కూడా మనసే మంత్రాలయం టీవీ సీరియల్ ను  రూపొందిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే మంత్రాలయం లో మనసే మంత్రాలయం టీవీ సీరియల్ రూపొందిస్తున్నట్లు తెలిపారు.  చిన్న పిల్లలతో తీయబోతున్న సత్యమేవ జయతే సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభిస్తున్నట్లు మంజునాథ్ పాండవపురం తెలిపారు.

 ప్రతి వీదిలో సీసీ రోడ్లు

Tags: Manjunath is a famous Kannada film director

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *