వీల్‌చైర్‌లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న మన్మోహన్
న్యూఢిల్లీ ముచ్చట్లు:
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా పార్లమెంట్‌కు వచ్చి ఓటేశారు. అయితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్లు తెలుస్తోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు మన్మోహన్ వీల్‌చైర్‌లో వచ్చారు. పార్లమెంట్లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సులో ఆయన ఓటేశారు. వ్యక్తిగత సిబ్బంది సహకారం తీసుకుని ఎంపీ మన్మోహన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ పోటీపడుతున్న విషయం తెలిసిందే.
Tags: Manmohan came in a wheelchair and exercised his right to vote