బాబు దీక్షకు సంఘీభావం తెలిపిన మన్మోహన్

Manmohan, who has solidarity with Babu's initiative

Manmohan, who has solidarity with Babu's initiative

Date:11/02/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం  ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చేపట్టిన ధర్మపోరాట దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మన్మోహన్ మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. విభజన హామీలు అమలు చేయడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని అన్నారు. చంద్రబాబు చేస్తున్న కృషికి అందరం సహకరిస్తామని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా తదితరులు చంద్రబాబును కలిసి దీక్షకు మద్దతు తెలిపారు.
Tags; Manmohan, who has solidarity with Babu’s initiative

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *