లాయర్స్ వాయిస్ కేలండర్ ను విడుదల చేసిన మనోహర్ రెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
లాయర్స్ వాయిస్ మాస పత్రిక 2013సం. ర నూతన కేలండర్ ను విజయవాడ లో వై ఎస్ ఆర్ పార్టీ లీగల్ సెల్ కార్యాలయంలో మంగళ వారం ఉదయం వై ఎస్ ఆర్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. మనోహర్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ లాయర్ ఎన్. రాజా రెడ్డి ఎడిటర్ గా గత ఎనిమిది సంవత్సరాలుగా తిరుపతి కేంద్రంగా లాయర్స్ వాయిస్ మాస పత్రికను స్థాపించి రాజకీయ, న్యాయ, విద్యా పరమైన అంశాలతో కూడిన పత్రికను నిరంతరాయంగా తీసుకొని రావడం హర్శించ దగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో లాయర్స్ వాయిస్ మాస పత్రిక ఎడిటర్ ఎన్. రాజారెడ్డి, విజయవాడ బార్ అసోసియేషన్ నాయకులు నరహరి శెట్టి శ్రీహరీ, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags; Manohar Reddy released Lawyers Voice Calendar

