మంథని డిగ్రీ కళాశాల అభివృద్ధికి మరో ఉద్యమం
-డిగ్రీ కళాశాల పూర్వ అధ్యక్షుడు కొండేల మారుతి
మంథని ముచ్చట్లు:
నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురోభివృద్ధి కై మరో ఉద్యమం చేపట్టనున్నామని పూర్వ అధ్యక్షుడు కొండేల మారుతి పేర్కోన్నారు. శుక్రవారం ఆయన మంథని లో పత్రిక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు తొలి విడతగా పూర్వ విద్యార్థులతో సమావేశం జరుగుతుందన్నారు.ఈ మాసాంతములో యుజిసి కి అనుసంధానంగా న్యాక్ టీం పర్యటించనుందన్నారు.కళాశాల ఆవశ్యకతను అధ్యయనం చేపట్టే క్రమంలో ఆ బృందం పూర్వ విద్యార్థులతో ఇష్టాగోష్ఠి నిర్వహిస్తుందన్నారు.వారికీ సమాచారం నివేదించటానికి అలుమిని సంస్థాగత రూపేణాకమేటీ ఏర్పాటు చేస్తమన్నారు. ప్రస్తుత స్థితిగతులు విశ్లేషణ చేసే నేపథ్యంలో పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సహకరించాలని మారుతి కోరారు. అభివృద్ధికి నాందీ గా ఉద్యమ పతాక గా ఆహ్వానం స్వీకరించిన వారు చేయూతగ నిలవాలని తన ప్రకటనలో వివరించారు.

Tags: Manthani Degree College is another movement for development
