వైకుంఠ రథం ప్రారంభించిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు          

మంథని ముచ్చట్లు:


సింగరేణి సిఎస్ఆర్ నిధుల నుండి 10 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన నూతన వైకుంఠ రథం ను మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం కన్నాల గ్రామంలో ప్రారంభించారు. మంథని మండలంలోని కన్నాల గ్రామానికి  సింగరేణి సిఎస్ఆర్ నిధుల నుండి కొనుగోలు చేసిన వైకుంఠ రథం, డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ ను శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ రథం ఎవరికి ఉపయోగా పడకూడదని అందరూ ఆ భగవంతుని కృపతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని  శ్రీధర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిందురాల మంగ, నాయకుడు చిందురాల దామోదర్ రెడ్డి, రైతు నాయకుడు ముస్కుల సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు కావటి భూమయ్య, రాజయ్య, పుల్లారెడ్డి, మాజీ జెడ్పిటిసి మూల సరోజన, మంథని కౌన్సిలర్లు పెండ్రు రమా, హనుమంతరావు, నాయకులు తోకల మల్లేష్, రమేష్ రెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షుడు సురేందర్ రెడ్డి లతోపాటు గ్రామస్తులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

Tags: Manthani MLA Duddilla Sridhar Babu started the Vaikuntha Ratham

Leave A Reply

Your email address will not be published.