Natyam ad

సినీ హీరో సుమన్ ప్రశంసలు అందుకున్న మంథని షోటోకాన్ కరాటే విద్యార్థులు

మంథని ముచ్చట్లు:

ప్రముఖ సినీ హీరో సుమన్ తల్వార్ ప్రశంసలను  మంథని షోటోకాన్ కరాటే విద్యార్థులు అందుకున్నారు. మంగళవారం రోజున హైదరాబాద్ లో జపాన్ కరాటే అసోసియేషన్, షోటోకాన్ కరాటే బ్లాక్ బెల్ట్ గ్రేడింగ్ టెస్టులో మంథని షోటోకాన్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ పెద్దపల్లి జిల్లా జెకెఏ చీఫ్ ఇనిస్ట్రక్టర్ కోoడ్ర నాగరాజు ఆధ్వర్యంలో మంథని కి చెందిన నలుగురు  సీనియర్ విద్యార్థులు పాల్గొని అత్యధిక ప్రతిభ ను కనబరచి బ్లాక్ బెల్ట్ సాధించారు.  గత ఆరు సంత్సరకాలంగా షోటోకాన్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ లో శిక్షణ పొందుతూ . మంథని సాయి కుమార్ (26) ఖానా పూర్ , మంథని సతీష్ (24) ఖానాపూర్, జనగాం శివకుమార్ (26)ఎక్లాస్ పూర్, జంజర్ల ప్రభుదాస్ (26)  ఎక్లాస్ పూర్ విద్యార్థులుబ్లాక్ బెల్ట్ లు సాధించారు. గ్రేడింగ్ టెస్టు పర్య వేక్షణ గా తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చీఫ్ ఎగ్జామినర్ షియాన్ రాపోలు సుదర్శన్ , తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ నూకల బానయ్య లు పర్య వేక్షిoచారు. బ్లాక్ బెల్ట్ గ్రేడింగ్ టెస్టు కి ముఖ్య అతిథిగా షోటోకాన్ కరాటే చైర్మన్ సినీ హీరో సుమన్ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా విద్యారథులందరికీ సర్టిఫికేట్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సుమన్  మాట్లాడుతూ  కరాటే వలన విద్యార్థులలో ఆత్మ స్థైర్యం, ఆత్మ రక్షణ, భౌతిక,మానసిక ఒత్తిడిని, దృఢత్వం, క్రమశిక్షణ, పెంపొందించే విధంగా ఉంటుందన్నారు.  ముఖ్యంగా ఈ రోజుల్లో అమ్మాయిలపై జరుగుతున్న దాడులను అరికట్టవచ్చు అని తెలిపారు. రాణి లక్ష్మీ బాయి ఆత్మ రక్షా శిక్షణ- బాలికల కోసం స్వీయ రక్షణ కార్యక్రమం – 2023-24 రాష్ట్రంలోని 4066 పాఠశాలల్లో 3 నెలల వ్యవధిలో-మంజూరీ ఆర్డర్ జారీ చేయబడిందని కరాటే మాస్టర్స్ వినియోగించుకోవాలి అని తెలిపారు.బ్లాక్ బెల్ట్ పొందిన విద్యార్థులను సీనియర్ కరాటే మాస్టర్ పర్ష బక్కయ్య, శంకర్ గౌడ్ లు అభినందించారు.

 

Post Midle

Tags: Manthani Shotokan Karate students who received praise from movie hero Suman

Post Midle