Natyam ad

శ్రీవారి సేవా సదన్ మరియు అన్నప్రసాదం కాంప్లెక్స్‌ను సందర్శించిన మంత్రాలయ పీఠాధిపతి

– శ్రీవారి సేవకుల సేవలు అద్భుతం

 

తిరుమల‌ ముచ్చట్లు:

Post Midle

మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి శనివారం సాయంత్రం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 2ని సందర్శించి శ్రీవారి సేవకులకు అనుగ్రహ భాషణం అందించారు.స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ శ్రీవారి సేవకులు అంకితభావంతో చేస్తున్న సేవలను కొనియాడారు. సుమారు 22 ఏళ్ల క్రితం టీటీడీ ప్రారంభించిన శ్రీవారి సేవలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద సేవకులుగా పేరు నమోదు చేసుకున్న దాదాపు 13 లక్షల మంది భక్తులు తమ నిష్కళంకమైన సేవలను అందించినట్లు తెలుసుకోవడం గొప్ప విషయమన్నారు. అన్నమయ్య,  త్యాగయ్య, శ్రీ పురందర దాసు, శ్రీ వెంగమాంబ వంటి గొప్ప భక్తులు శ్రీవేంకటేశ్వరుని సేవలో మోక్షాన్ని పొందారని స్వామీజీ అన్నారు. “కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, ప్రత్యక్ష గురువుగా శ్రీ రాఘవేంద్ర స్వామి వారు భక్తులచే పూజింపబడుతున్నట్లు తెలిపారు.ప్రతిరోజు తిరుమలకు లక్ష మందికి పైగా భక్తులు వస్తున్నారని, అదేవిధంగా మంత్రాలయానికి కూడా 65 వేల మంది భక్తులు వస్తున్నట్లు తెలిపారు.

 

 

 

యాత్రికుల రద్దీకి అనుగుణంగా మంత్రాలయంలో కూడా శ్రీవారి సేవ తరహాలో గురుపాద సేవ పేరుతో స్వచ్ఛంద సేవను ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. వారి తోటి యాత్రికులకు సేవలు అందించడానికి, వారి కుటుంబాలు మరియు స్నేహితులను విడిచిపెట్టి వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న శ్రీవారి సేవకులు అంకిత భావంతో చేస్తున్న సేవలను స్వామీజీ హృదయపూర్వకంగా అభినందించారు.అంతకుముందు, స్వామీజీ తన శిష్యులతో కలిసి శ్రీవారి సేవకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, వసతి, శ్రీవారి సేవా వాలంటీర్లకు విధుల కేటాయింపు,
జీడిపప్పు స్ప్లిట్ సేవ మొదలైన వాటిని పరిశీలించారు.అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌ను సందర్శించి అన్న ప్రసాదాల తయారీ, భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించడం, కూరగాయల నిల్వ, కూరగాయాలు జరిగే యంత్రాన్ని పరిశీలించారు. అనంతరం టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాదంపై స్వామీజీ ముఖాముఖి భక్తుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అన్న ప్రసాదంపై భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు.విజివో   బాలిరెడ్డి, అన్న ప్రసాదం ప్రత్యేకాధికారి   జీఎల్‌ఎన్‌ శాస్త్రి, అన్నప్రసాదం.ఏఈవో   గోపీనాథ్‌, ఏపీఆర్వో కుమారి పి.నీలిమ శ్రీవారి సేవా కో-ఆర్డినేటర్‌   శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Mantralaya Presiding Officer visited Srivari Seva Sadan and Annaprasadam Complex

Post Midle