మంత్రి శ్రావణ కుమార్ కు పలువురి అభినందనలు

Many are greeted by Minister Sravana Kumar

Many are greeted by Minister Sravana Kumar

Date:16/11/2018
అమరావతి ముచ్చట్లు:
ప్రాథమిక ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ భాద్యతలు చేపట్టిన కిడారి శ్రావణ్ కుమార్ ని పలువురు మంత్రులు అభినందించారు. శుక్రవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో  మంత్రులు చినరాజప్ప, నారాలోకేష్, భూమా అఖిల ప్రియ, ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ మరియు వైద్య ఆరోగ్య ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య కలిసి అభినందనలు తెలిపారు. కొత్తగా బాద్యతలు స్వీకరించిన సందర్బంగా మంత్రి నారాలోకేష్ శ్రావణ్‌ను కలిసి మాట్లాడుతూ చైనా పర్యటన ముందు అసెంబ్లీ సమావేశాల సమయంలో స్వర్గీయ కిడారి సర్వేశ్వరరావు గారితో  నియోజకవర్గం అభివృద్ది పనులపై మాట్లాడుతూ కలిసి భోజనం చేశానని గుర్తుచేసుకున్నారు. శాఖ పరంగా, నియోజకవర్గ అభివృద్దికి సహకారం కావాలని శ్రావణ్ కుమార్ కోరగా మంత్రులందరి సహకారం ఎప్పుడూ ఉంటుందని హామి ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుటుంబ సభ్యుల బాగోగులు గురించి మంత్రి లోకేష్ శ్రావణ్‌ను అడిగి తెలుసుకున్నారు. అరకు ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంబించాలని శ్రావణ్ కుమార్ లోకేష్ ను కోరగా డీపీఆర్‌లు సిద్దం చేశామని త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. నిమ్మకూరును యూజీడి క్రింద రాష్ట్రంలోని ఒక మోడల్‌గా అభివృద్ది చేశామన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ, పంచాయితీ శాఖలు సమన్వయంతో పనిచేయడం వలన రాష్ట్రంలో మలేరియా జ్వరాలు తగ్గుముఖం పట్టినట్లు లోకేష్ పేర్కొన్నారు.
మలేరియా జ్వరాల అధ్యయనానికి పూనం మాలకొండయ్య అధ్యక్షతన ఒక కమిటీ శ్రీలంకలో పర్యటించడం జరిగిందన్నారు. జ్వరాలు తగ్గుముఖం పట్టాలంటే ప్రజలల్లో మార్పు తీసుకురావాలని, వారిలో అవగాహన కల్పించాల్సీన అవసరం ఉందన్నారు. నీటిని నిల్వ ఉంచకూడదని  వాటర్ ట్యాంకులను, మురిగునీటి కాల్వలను శుభ్రంగా ఉంచాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు .రాబోయే 45రోజుల్లో పంచాయితీ రాజ్  శాఖలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులను పూర్తిచేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ వ్యాఖ్యనించారు.వైద్య ఆరోగ్యశాఖలో అమలవుతున్న పథకాలు, గత నాలుగున్నర ఏళ్లల్లో శాఖలో జరిగిన అభివృద్ధి గురించి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి  పూనం మాలకొండయ్య మంత్రులకు వివరించారు. ముంబై కి చెందిన ప్రఖ్యత లీలావతి ఆసుపత్రిని త్వరలో అమరావతిలో ప్రారంభించనునట్లు లోకేష్ మంత్రి శ్రావణ్‌కు తెలియజేశారు. త్వరలో మరో 5 ప్రముఖ ఆసుపత్రులు  అమరావతి రాజధానికి తరలి రానున్నట్లు మంత్రి లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు.అరకు ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ మరింత అభివృద్ది చేయాలని మంత్రి శ్రావణ్ కుమార్ పర్యటక శాఖ మంత్రి అఖిల ప్రియను  కోరగా ఎవరైనా ముందుకు వస్తే పీపీపీ పద్దతిలో పర్యాటకంగా అరకును ఇంకా అభివృద్ది చేస్తామన్నారు.
Tags:Many are greeted by Minister Sravana Kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *