ఎమ్మెల్సీ పదవులకు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు రాజీనామా

హైదరాబాద్  ముచ్చట్లు:

 


ఎమ్మెల్సీ పదవులకు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు రాజీనామా చేశారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కడియం శ్రీహరి ,పాడి కౌశిక్‌ రెడ్డి ఎమ్మెల్సీలుగా నేడు రాజీనామా చేశారు ఈ మేరకు రాజీనామా లేఖలను శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి అందజేశారు. వీరి రాజీనామాలను మండలి చైర్మన్‌ ఆమోదించారు.ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వీరు ముగ్గురూ ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం తెలిసిందే. జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా వీరు ఎన్నికయ్యారు. నిబంధనల ప్రకారం 15 రోజుల్లోపు ఏదో ఒక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఈ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది.

Tags: Many BRS leaders resigned from MLC posts

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *