Date:09/06/2019
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి, గనులశాఖమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలో పలువురు కలసి శుభాకాంక్షలు తెలిపి, సన్మానించారు. ఆదివారం మంత్రి తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం భద్రచలంకు చెందిన ఎస్కెటి గ్రూప్స్ అధినేతలు దోసపాటి రాము, వెంకటేశ్వరరావు, కంభంపాటి శ్రీనివాసరావు, అత్తులూరి ఉమామహేశ్వరరావు, కొళ్ల నరసింహరావు తదితరులు మంత్రికి శాలువకప్పి, మెమెంటోలు ఇచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా భద్రచల రామయ్య ప్రసాదాలు అందజేశారు. అలాగే తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డికి శాలువకప్పి సన్మానించారు. అలాగే పుంగనూరు మున్సిపల్ కౌన్సిలర్లు అమ్ము, ఆసిఫ్, మైనార్టీ నేతలు కిజర్ఖాన్, ఆఫ్సర్లు మంత్రిని కలసి శాలువ కప్పి సన్మానించారు. అలాగే జిల్లా ఏపిసిపిఎస్ ఉద్యోగుల సంఘ ప్రధాన కార్యదర్శి రేగంటి దేవానంద్ ఆధ్వర్యంలో మంత్రికి శాలువకప్పి సన్మానం చేశారు. అలాగే చిత్తూరు ఎంపి రెడ్డెప్పను దేవానంద్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఎస్ ఉద్యోగ సంఘ నేతలు వెంకటయ్య, రమేష్, రవి, సుధాకర్, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.
బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడుగా మదుకుమార్శర్మ
Tags:Many of the leaders who greeted Minister Peddireddy were greeted together