Many of the leaders who greeted Minister Peddireddy were greeted together

మంత్రి పెద్దిరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు

Date:08/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర పంచాయతీరాజ్‌ , గ్రామీణాభివృద్ధి, గనులశాఖమంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విజయవాడలో పలువురు కలసి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెద్దిరెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకుడు వెంకటరమణరాజు, ఆయన కుమారుడు ప్రదీప్‌రాజు కలసి మంత్రికి శాలువలు కప్పి, సన్మానం చేశారు. మంత్రి రాజుకు సన్మానం చేశారు. అలాగే పుంగనూరుకు చెందిన పెద్దిరెడ్డి యువజన సంఘ నాయకులు మిద్దింటి కిషోర్‌, రాజేష్‌, జెపియాదవ్‌, హేమంత్‌, బండకుమార్‌ లు కలసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొండవీటి నాగభూణం మాట్లాడుతూ సుమారు పది సంవత్సరాలుగా పుంగనూరును అభివృద్ధి చేయనివ్వకుండ మాజీ సీఎంలు అడ్డుకున్నారన్నారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గంలో పెద్దిరెడ్డికి మంచి శాఖలు లభించిందన్నారు. పుంగనూరు నియోజకవర్గంతో పాటు ర్ఖా•న్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పుంగనూరు ఎమ్మెల్యేకు అవకాశం లభించడం అదృష్టమన్నారు. ఇక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని కొనియాడారు.

ఆదివారం అత్యంత శక్తి వంతమైన రోజు

Tags: Many of the leaders who greeted Minister Peddireddy were greeted together

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *