మంత్రి అమరనాథ రెడ్డి సమక్షంలో టీడీపీ లో చేరిన మైనార్టీ సోదరులు

Many people in the presence of minister join in the party ....

Many people in the presence of minister join in the party ....

Date:16/09/2018

పెద్దపంజాణి  ముచ్చట్లు:

భద్రాచలం గ్రామానికి చెందిన పలువురు మైనార్టీ సోదరులు పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథ రెడ్డి  సమక్షంలో ఆదివారం వైస్సార్సిపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వారు తెలియజేశారు. గంగవరం మండలంలోని మామడుగు సమీపంలోని గజారామం వద్ద మంత్రి పార్టీలోకీ చేరిన వారికి కండువాలను కప్పి సాధరంగా ఆహ్వానించారు.

 

రాబోవు ఎన్నికల్లో అమరనాథ రెడ్డి  ఆధ్వర్యంలో పార్టీ గెలుపునకు కృషి చేస్తామని ఈ సంధర్భంగా వారు పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో భద్రాచలం గ్రామానికి చెందిన ఎస్.అఫ్రోజ్, సద్దాం,షబ్బీర్,షంషీర్ ఖాన్,ఆలం,సనాఉల్లా,ఖాజా,అనీఫ్ లతో పాటు వారి అనుచరులు సుమారు 50 మంది తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి చెంగారెడ్డి, మైనార్టీ నాయకులు బావాజాన్ తదితరులున్నారు.

విమానాశ్రయంలో డిఆరై అధికారుల తనిఖీలు

Tags:Many people in the presence of minister join in the party ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *