స్పందనకు పలు వినతులు
నంద్యాల ముచ్చట్లు:
సోమవారం నాడు నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్ ఏ ఆర్ ఎస్ ఆడిటోరియంలో ప్రజాసమస్యలపై స్పందన కార్యక్రమంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రజల నుండి అర్జీలను స్పీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీసామూన్ , జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య, డి ఆర్ ఓ పుల్లయ్య తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.అనంతరం వారు నంద్యాల జిల్లా మున్సిపల్ టౌన్ హల్ లో వరుసగా నాలుగో ఏడాది వైఎస్ ఆర్ రైతు భరోసా పి ఎం కిసాన్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు గణపురం నుండి ప్రసంగిస్తున్న లైవ్ ను నంద్యాల జిల్లా నుండి వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీసామూన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి,మార్కెపెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపి రెడ్డి ,జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ భరత్ కుమార్ రెడ్డి,తదితర అధికారులు పాల్గొన్నారు. అనంతరం వారు ఆర్ ఏ ఆర్ ఎస్ లో వేసవి విజ్ఞాన శిబిర కరపత్రాలను డెంగ్యూ దినోత్సవ పెక్సీలను ఆవిష్కరించారు.
Tags: Many requests for response

