మత్స్యకారుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు

Date:07/08/2020

కామారెడ్డి ముచ్చట్లు:

సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డి అడ్లూరు చెరువులో ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత చేప పిల్లలను ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే జాజుల సురేందర్ తో కలిసి చెరువులో వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సముద్ర తీర ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం లేదన్నారు.మత్స్యసంపదలో దేశంతో పోటీపడి నీలి విప్లవం వైపు పయనిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యకారుల ముఖాల్లో సంతోషం నింపారన్నారు.  82 కోట్ల చేప పిల్లల కోసం 52 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో  మత్స్యకారుల కుటుంబాలకు దాదాపు రూ. 11 వందలకోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు.

 

రైతుల ధర్నా

 

Tags:Many welfare programs for fishermen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *