మన్యం బంద్ తెలుగు దేశం పార్టీ సంపూర్ణ మద్దతు
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ మన్యంలో జరిగే రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ 11 మండలాలు గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరగబోయే మన్యం బంద్ కు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు సివేరి దొన్నుదొర సంపూర్ణ మద్దతు ఉంటుందని గిరిజనులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోరాటాలతో నే గిరిజన సమస్యలు పరిష్కారమవుతాయని,సమస్య పరిష్కారానికై ప్రతి ఒక్కరూ నడుం బిగించి గళం విప్పి ముందుకు కదిలి రావాలని, తెలిపారు.ఆదివాసి మాతృభాష వాలంటీర్లు ను తక్షణమే రెన్యూవల్ చేయాలని ఇప్పటికైనా ఆదివాసీ తెగల మాతృభాష విద్యాభివృద్ధి, వికాసానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలన్నారు. జిఓ నెంబర్ 3 ను పునరుద్ధరణ చేసి చట్టబద్దత కల్పించాలన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్ మెస్ చార్జీలు పెంచాలని అటవి హక్కు చట్ట సవరణ వ్యతిరేకించాలని ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు.గిరిజన ప్రాంతంలో గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, భాషా వలంటీర్లు, గిరిజన సంఘం ఆధ్వర్యంలో జనవరి 6న జరిగే మన్యం బంద్ ను ఆదివాసీ నాయకులు విద్యార్థులు ప్రజలు మహిళలు యువత ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని నిలుపునిచ్చారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Manyam Bandh Telugu Desam Party fully supports