Natyam ad

మావోయిస్టు  కొరియర్లు, మిలీషియా సభ్యులు అరెస్ట్

భద్రాద్రి ముచ్చట్లు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో  ఎస్పీ డాక్టర్ వినీత్ జి విలేకరుల సమావేశం లో మాట్లాడారు. దుమ్ముగూడెం పోలీస్,  సీఆర్పిఎఫ్ బెటాలియన్, స్పెషల్ పార్టీ పోలీసులు నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు కొరియర్స్ , ఐదుగురు మిలీషియా సభ్యులను  అరెస్ట్ చేశారు. వారి నుంచికార్డెక్స్ వైరు-90 బెండల్స్, డిటోనేటర్లు-500,  స్లర్రీ స్టిక్స్-600, బొలెరో వాహనం, ట్రాక్టర్,  మోటార్ సైకిళ్ళు 2 స్వాధీనం  చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వినీత్ జి వెల్లడించారు.
నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుల ఆదేశానుసారం పోలీస్ క్యాంపుల పైన మరియు కుమ్మింగ్ కు వచ్చే పోలీసుల పైన దాడులు చేయడానికి అవసరమైన ల్యాండ్ మైండ్ లను ఐఈడీలు మరియు రాకెట్ లాంచర్ల తయారీకి ఉపయోగపడే పేలుడు పదార్థాలను మావోయిస్టు కొరియర్లు ఐదు మంది బొలెరో వాహనంలో దుమ్ముగూడెం మండలం ములకలపల్లి అటవీ ప్రాంతంలో తీసుకొని వచ్చి మావోయిస్టు పార్టీ మలేషియా సభ్యులు ఐదు మంది నుంచి తీసుకువచ్చిన ట్రాక్టర్లు లోడ్ చేస్తుండగా పోలీసు వారు పట్టుకున్నారని అన్నారు. ఈ కేసులో మావోయిస్టు పార్టీ కొరియర్లకు పేలుడు పదార్థాలు సరఫరా చేసే వ్యక్తులపై మరియు లైసెన్స్ సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

 

Tags; Maoist couriers, militia members arrested

Post Midle
Post Midle