ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి

Kidari murder killer killed me

Kidari murder killer killed me

Date:12/10/2018
విశాఖ  ముచ్చట్లు:
ఆంథ్రా ఒడిషా సరిహద్దుల్లో మళ్లీ అలజడి చెలరేగింది. మావోలు పోలీసుల మద్య  కాల్పులు కొనసాగాయి.  ఒడిషాలోని  మల్కన్ గిరి ప్రాంతాలైన రామగుండా,ఆంద్రపల్లి పరిసర ప్రాంతాలలో ఆంద్ర గ్రేహౌండ్స్ ఆద్వర్యంలో కూంబింగ్  కొనసాగుతుంది. విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చిచంపిన ఘటన తరువాత పోలీసులు ఏఓబీని జల్లెడ పడుతున్నారు.  తాజాగా చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో మావో అగ్రనేత మీనా మృతి చెందింది. ఈ విషయాన్ని విశాఖ పట్నం జిల్లా ఎస్పీ రాహుల్దేవ్శర్మ ధృవీకరించారు.  కూంబింగ్ సందర్భంగా అండ్రపల్లి వద్ద పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారని, ఈ సందర్భంగా ఎదురు కాల్పులు జరిగాయని ఎస్పీ వివరించారు. ఈ ఘటనలో మీనా  అనే మహిళ మృతి చెందినట్లు గుర్తించామన్నారు.మీనా ” ఏరియా కమాండర్ గాజర్ల రవి అలియాస్ ఉదయ్ భార్య గా పోలీసులు అనుమానిస్తున్నారు.
Tags:Maoist killed in firing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *