Natyam ad

మావోయిస్టుల దగ్గర అమెరికన్‌ మేడ్‌ వెపన్స్‌.

ముంబై ముచ్చట్లు:


అత్యంత అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు మావోయిస్టులు. ఇప్పటివరకూ మావోయిస్టుల దగ్గర ఏకే 47లాంటి గన్స్‌ మాత్రమే దొరికేవి. కానీ, ఫస్ట్‌టైమ్‌ అమెరికన్ మేడ్‌ వెపన్స్‌ దొరకడం పోలీస్‌ వర్గాల్లో కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించగా, స్పాట్‌ నుంచి పెద్దఎత్తున ఆయుధాలను, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో అమెరికన్‌ మేడ్ తుపాకులు ఉండటం సంచలనంగా మారింది. పైగా అది ఎం1 కార్బైన్‌ తుపాకీ కావడం పోలీసులను కలవరపెట్టింది. ఎన్‌కౌంటర్‌ స్పాట్‌ నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల గురించి పోస్టుమార్టం మొదలుపెట్టారు పోలీసులు.అమెరికాలో తయారైన ఆయుధాలు ఎలా మావోయిస్టులకు చేరాయి..? ఎలా సమకూర్చుకున్నారు..? ఎక్కడ్నుంచి వీళ్లకు ఆయుధాలు అందుతున్నాయనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. తుపాకీపై ఉన్న సీరియల్‌ నెంబర్‌ ఆధారంగా ఆయుధాలను ఎక్కడ్నుంచి సమకూర్చుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మావోయిస్టుల దగ్గర విదేశీ ఆయుధాలు దొరకడం కొత్తేమీ కాదు. కానీ, మేడిన్‌ యూఎస్‌ఏ వెపన్స్‌ దొరకడం మాత్రం ఇదే ఫస్ట్‌టైమ్ అంటున్నారు పోలీసులు. బీజాపూర్‌లో దొరికిన గన్‌ వినియోగించడం చాలా సులభమని, సెకండ్ వరల్డ్‌ వార్‌లో అమెరికా వీటిని వాడిందని చెబుతున్నారు. మొత్తానికి, బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో అమెరికన్‌ మేడ్ వెపన్‌ దొరకడం మాత్రం పోలీస్‌ వర్గాలను కలవరపెట్టింది.ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ల నుంచి అమెరికా తయారు చేసిన ఆటోమేటిక్ కార్బైన్ క్యాలిబర్ 30ఎం1 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఆంజనేయ వాస్నేరియన్ తెలిపారు.

 

 

ఈ ఆయుధం మందుగుండు శక్తి 300 గజాలు దూరంలోని టార్గెట్‌ను ఈజీగా ఫైర్ చేస్తుందని.. దీని వల్ల ఏకకాలంలో 15 నుంచి 20 రౌండ్లు కాల్చవచ్చన్నారు.ఇది చాలా ప్రమాదకరమైన ఆయుదమని అన్నారు. ఈ ఆయుధాన్ని రెండవ ప్రపంచ యుద్ధం, వియత్నాం యుద్ధం,  కొరియా యుద్ధంలో అమెరికన్ సైనికులు విస్తృతంగా ఉపయోగించారని.. సాధారణంగా నక్సలైట్ల పెద్ద నాయకుల వద్ద ఆటోమేటిక్ ఆయుధాలు ఉంటాయని ఎస్పీ చెప్పారు. అయితే, నక్సలైట్ల వద్దకు అత్యాధునిక ఆయుధాలు ఎలా చేరుతున్నాయనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇదే అంశాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ సహాయం కూడా తీసుకుంటున్నారుఅంతకుముందు డిసెంబర్ 2011, ఏప్రిల్ 2014లో కంకేర్ జిల్లాలోని రావ్‌ఘాట్, భానుప్రతాపూర్ ప్రాంతాల్లో నక్సలైట్లతో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత 7.65 మిమీ మేడ్ ఇన్ యుఎస్‌ఎ అని గుర్తించబడిన రెండు ఆటోమేటిక్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. 2018 సంవత్సరంలో, సుక్మా జిల్లాలో నక్సలైట్లతో ఎన్‌కౌంటర్ తర్వాత, నారాయణపూర్ జిల్లాలో మేడ్ ఇన్ జర్మనీ అని గుర్తించబడిన రైఫిల్, యుఎస్ఎలో తయారు చేయబడిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

 

Post Midle

Tags; Maoists have American made weapons.

Post Midle