తెలంగాణలో మావోయిస్టుల గురి

Maoists in Telangana

Maoists in Telangana

Date:19/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టులు గురి పెట్టారా…? మహిళా మావోయిస్టుల నుంచి నాయకులకు ముప్పు పొంచి ఉందా..? లేడీ సెక్యూరిటీ పోలీసులను నియమించడానికి కారణం ఇదేనా..? అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి..తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారం రోజు రోజుకీ ఊపందుకుంటోంది. నాయకులు ఉదయం నుంచి రాత్రి వరకూ నియోజక వర్గాల్లో ప్రజల మధ్యే గడుపుతున్నారు. అయితే జనం మధ్య నాయకులు ఉన్నప్పుడు వారిని టార్గెట్ చేయడం సంఘవిద్రోహ శక్తులకు చాలా ఈజీ ఈ నేపథ్యంలో గత అనుభవాల దృష్టిలో పెట్టుకొని వారికి భారీ భద్రత కల్పించారు పోలీసులు నాయకులపై మహిళా మావోలు దాడి చేయొచ్చు అన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మహిళా పోలీసులను సైతం రంగంలోకి దింపారు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న ఐదుగురు లేడీ పోలీసులను ప్రయోగాత్మకంగా మోహరించింది. ఏపీలో ఇటీవల ఇద్దరు ప్రజాప్రతినిధులను మావోలు కాల్చి చంపారు ఈ వ్యవహారంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు ఎన్నికల వేల ఎక్కడా ఎలాంటి అవాంచనీయ ఘటనలూ జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు తెలంగాణా‌లో మావోయిస్టుల ప్రభావం ఉన్న 13 నియోజక వర్గాల్లో అధికంగా ఉంటుందని అంచనా వేసిన పోలీసులు అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.
ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంథని, భూపాలపల్లి, ములుగు, మునుగురు, భద్రాచలం, ఉట్నూరు, మణుగూరు, ఇల్లందు, మంచిర్యాల, రామగుండం నియోజిక వర్గాల్లో అభ్యర్థులకు 4ప్లెస్ 4 గన్ మెన్ లను కేటాయించారు.. ఇక సీఎం పర్యటనలపై కూడా పోలీస్ అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎన్నికల పర్యటనల్లో భాగంగా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటనలను రద్దు చేస్తునట్లు తెలుస్తోంది బాల్క సుమన్ పోటీ చేస్తున్న నియోజక వర్గం చెన్నరుకి ప్రచారంలో భాగంగా కేటీఆర్ హాజరుకావాల్సి ఉంది అయితే నిఘా వర్గానికి వచ్చిన సమాచారం తో కేటీఆర్ పర్యటన రద్దు చేసుకునట్లు సమాచారం ఇక ఆదిలాబాద్ జిల్లాలో‌ని నాలుగు ఏజెన్సీ నియోజక వర్గాల్లో ఎక్కడైనా మావోలు పంజా విసిరే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.మావో యిస్ట్ ప్రభావిత గ్రామాల్లో కూంబింగ్, తో పాటు కల్వర్ట్ చెకింగ్ కోసం పోలీసులు స్పెషల్ పార్టీ పోలీసులు ఏర్పాటు చేశారు ఇప్పటికే కౌంటర్ యాక్షన్ టీమ్స్ జిల్లాల్లో విస్తృతంగా గాలిస్తున్నాయి చతీస్‌ఘడ్, మహా రాష్ట్ర సరిహద్దు‌లో ఉన్న గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టామంటున్న పోలీసులు ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు.
Tags:Maoists in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *