ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు మావోయిస్టు మృతి..
రాయ్‌పూర్ ముచ్చట్లు:
ఛత్తీస్‌గఢ్‌లో భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా కైకా మౌస్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతిచెందాడని పోలీసులు తెలిపారు.మృతుడిని మావోయిస్టు డిప్యూటీ కమాండర్ పూనెం రితేశ్‌గా గుర్తించామన్నారు. అతనిపై రూ.3 లక్షల రివార్డు ఉందని చెప్పారు. ఘటనా స్థలంలో ఆయుధం, కిట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతున్నదని వెల్లడించారు.
Tags:Maoists killed in crossfire in Chhattisgarh