మావోయిస్టుల ప్రతీకారం 8 జవాన్ల మృతి 

Date:13/03/2018
ఛత్తీస్‌గడ్‌  ముచ్చట్లు:
ఇటీవల  ఖమ్మ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్కు మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకున్నారు.తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని అటవీ ప్రాంతం లో జరిగిన ఏడురుకల్పుల్లో 8 మంది జవాన్లు మృతి చెందారు. ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులు అదను కోసం చూస్తుండగా మంగళవారం గొల్లపల్లి-కిష్టరాం ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు తారసపడ్డారు. దీంతో మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. జవాన్లు తేరుకుని కాల్పలు జరిపేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనలో 8 సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతిచెందగా.. మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు. జవాన్ల మృతదేహాలను హెలికాప్టర్‌ ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇటీవల తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణలోని తడపలగుట్ట, ఛత్తీస్‌గఢ్‌లోని పూజారికాంకేడు అటవీ ప్రాంతం సరిహద్దుల్లో ఈ కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో గ్రేహౌండ్స్ కు చెంది ఓ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయాడు.
Tags: Maoists’ killing of 8 jawans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *