మావోయిస్టుల మందుపాతరలు స్వాధీనం

ఏటూరునాగారం  ముచ్చట్లు :
శుక్రవారం నాడు మావోయిస్టులు నేతలు బడే చొక్కారావు,   కంకణాల  రాజీ రెడ్డి, ఇతర నేతలు సమావేశమై కూంబింగ్ కోసం వచ్చే పోలీసు పార్టీని చంపడానికి కొప్పు సూరు అటవీ ప్రాంతంలో  ల్యాండ్ మైన్స్ పెడుతున్నారనేని సమాచారం పోలీసులకు అందింది. దాంతో పోలీసులు కొప్పుసూరు  అటవిప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ కోసం బయలుదేరారు. సుమారు ఉదయం 11 గంటలకు కొప్పుసూరు నుండి గుండ్ల వాగు ప్రాజెక్టు కు వెళ్లే కాలిబాటలో సీపీఐ మావోయిస్టు పార్టీ వారు అమర్చిన కొన్ని పేలుడు పదార్థాలను కనిపట్టారు. బాంబు డిస్పోజల్ టీం,  డాగ్ స్క్వాడ్ సహాయంతో  వాటిని నిర్వీర్యం చేసారు.. సంబంధిత మావోయిస్టులపై వాజేడు పోలీస్ స్టేషన్ నందు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.          విచక్షణారహితంగా మావోయిస్టులు అటవీ ప్రాంతంలో బాంబులు అమర్చడం వల్ల అమాయక ప్రజలు బలవుతున్నారు. గతంలో ముకునూరు అటవీ ప్రాంతంలో పెట్టిన ల్యాండ్ మైన్ పేలుడు కారణంగా సోయం పెంటయ్య అనే గిరిజనుడు మరణించాడు. అదేవిధంగా ఈ ల్యాండ్ మైన్స్ వల్ల మనుషులకే కాకుండా పెంపుడు జంతువులకు వన్యప్రాణులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. అటవీ ప్రాంతంలో జీవించే రైతులకు తీరని నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడటానికి మావోయిస్టు పార్టీ పాతిపెట్టిన ల్యాండ్ మైన్స్ ను వెలికి తీయడానికి కుంబింగ్ ఆపరేషన్స్ జరుగుతాయని పోలీసులు వెల్లడించారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Maoists seize landmines

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *