Natyam ad

లారీని తగలబెట్టిన మావోయిస్టులు

బీజాపూర్ ముచ్చట్లు:


చత్తీస్ ఘడ్ రాష్ట్రం  నారాయణపూర్ జిల్లా లో మావోయిస్టులు తెగబడ్డారు. ఐరన్ ఓర్ కోసం వెళ్తున్న లారీని తగల పెట్టారు. నారాయణపూర్ జిల్లా పరస్ గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓర్చ వద్ద లారీని దగ్దం చేసారు.  లారీ చోటే డోంగర్ వద్ద ఉన్న ఐరన్  మైన్ కు లోడ్ కోసం వెళ్తున్నప్పుడు మావోయిస్టులు ఆపారు. లారీ డ్రైవర్, క్లీనర్లను దింపివేసి వాహనాన్ని తగలబెట్టారు. జిల్లా ఎస్పీ పుష్కర శర్మ ఘటనను ధ్రువీకరించారు.

 

Tags; Maoists set the lorry on fire

Post Midle
Post Midle