ఎస్‌ఐని దారుణంగా హత్య చేసిన మావోయిస్టులు

Date:12/03/2019
రాయ్‌పూర్‌ ముచ్చట్లు:
ఛత్తీస్‌ గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం కిడ్నాప్‌ చేసిన ఎస్‌ఐ కశ్యప్‌ ను దారుణంగా హత్య చేశారు. అతని మృతదేహం వద్ద ఓ లేఖను వదిలివెళ్లారు. అపహరణకు గురైన మరో వ్యక్తి జైసింగ్‌ కురేటి మాత్రం ఇంకా వారి చెరలోనే ఉన్నట్లు సమాచారం. అరన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రేవలి నుంచి ఎస్‌ ఐ లలిత్‌ కశ్యప్‌, ఆయన మిత్రుడు జైసింగ్‌ ను మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన విషయం తెలిసిందే. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కశ్యప్‌ ను అరన్‌ పూర్‌ లోని సీఆర్పీఎఫ్‌ బెటాలియన్‌కు బదిలీ చేశారు. సమీప గ్రామంలో ఉన్న తన మిత్రుడు జైసింగ్‌ కురేటిని కలిసేందుకు కశ్యప్‌ వెళ్లారు. సమాచారం తెలుసుకున్న మావోయిస్టులు గ్రామంలోకి ప్రవేశించి వారిని కిడ్నాప్‌ చేశారు.
Tags:Maoists who killed the SI badly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *