సూరత్ లో  రేప్ కు గురైన అమ్మాయిది మార్కాపురం

Date:18/04/2018
Marakapuram is the rape victim in Surat
Marakapuram is the rape victim in Surat
ఒంగోలు ముచ్చట్లు:
సూరత్‌‌లో ఏప్రిల్ 6 న దారుణ హత్యాచారానికి గురైన 11 ఏళ్ల చిన్నారిని ప్రకాశం జిల్లా మార్కాపురంకి చెందిన బాలికగా పోలీసులు అనుమానిస్తున్నారు. మార్కాపురం బాలికల వసతిగృహం నుంచి గత ఏడాది అక్టోబరు 11న మాకం చిన్ని (12) అనే బాలిక అదృశ్యమైంది. ఏప్రిల్ 6న భెస్తన్ ప్రాంతంలో అత్యంత పాశవికంగా హత్యకు గురైన చిన్నారిని గుర్తించేందుకు గుజరాత్ పోలీసులు దేశవ్యాప్తంగా అదృశ్యమైన సుమారు ఎనిమిది వేల మంది బాలికల ఫొటోలను పరిశీలించారు. హత్యకు గురైన బాలిక పోలికలు ‘చిన్ని’ ఫొటోతో సరిపోలడంతో వారు మార్కాపురం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే మార్కాపురం పోలీసులు చిన్ని తల్లిదండ్రులను తీసుకుని సూరత్ వెళ్లారు. అక్కడ బాలిక మృతదేహాన్ని పరిశీలించిన తల్లిదండ్రులు చిన్నిదిగానే భావించారు. ఈ ఘటనపై సూరత్ నగర కమిషనర్ సతీశ్ శర్మ మంగళవారం అత్యవసరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి హత్యాచార బాలిక తన కుమార్తెనని ఏపీకి చెందిన వ్యక్తి పేర్కొన్నట్టు తెలిపారు. చిన్నారి ఆధార్ కార్డును సైతం అందజేశాడని, అయితే అందులోని వేలిముద్రలు, పుట్టుమచ్చలతో మృతురాలి ఆనవాళ్లు సరిపోలలేదని పేర్కొన్నారు. దీంతో చిన్ని తల్లిదండ్రుల డీఎన్‌ఏతో సరిపోల్చి చూడాలని నిర్ణయించామని, ఇందు కోసం ఆయన డీఎన్ఏ నమూనాలను సైతం సేకరించినట్టు శర్మ తెలియజేశారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతురాలు చిన్ని ఔనా? కాదా? అన్న స్పష్టమైన నిర్ధారణకు రానున్నారు. అత్యంత సున్నితమైన ఈ అంశంపై వివరాలను వెల్లడించేందుకు కమిషనర్ నిరాకరించారు. చిన్నారి ఒంటిపై 89 గాయాలున్నట్టు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడయ్యింది. అంతేకాదు బాలిక మర్మాంగాల్లోకి ఇనుప చువ్వలను దూర్చి గాయపరిచినట్టు తేలింది.
Tags:Marakapuram is the rape victim in Surat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *